![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -245 లో.. స్వప్న చెప్పిన అబద్ధం వల్ల కావ్యని అందరు మోసం చేసిందని అనుకుంటారు. అత్తింట్లో ఎన్ని గొడవలు వచ్చినా కావ్యని కన్న కూతురులాగా చూసుకునే సుభాష్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచింది కావ్య. ఇప్పటికైనా బయటకు వచ్చి తప్పు తెలుసుకొని సపోర్ట్ చెయ్యడం మానేయ్యండని అపర్ణ అనగానే సుభాష్ మౌనంగా ఉండిపోతాడు.
మరొకవైపు స్వప్నని ఇన్ని రోజులు తక్కువ అంచన వేసాము కానీ తను ఈ రోజు ప్రవర్తించిన తీరు చూస్తే భయం వేసిందని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఎంత గట్టిగా అరిచినా అది తప్పు చేసింది. అదొక్కటి చాలని రుద్రాణి అంటుంది. మరొకవైపు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఇంటి పెద్దలు అయిన సీతారామయ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటారు. రేపు మన నిర్ణయం చెప్పాలి అని ఇందిరాదేవి అనగానే అదే దిగులుగా వుంది అని సీతారామాయ్య అంటాడు.. మరొక వైపు కావ్య కాఫీ తీసుకొని వెళ్లి అపర్ణకి ఇవ్వగా, అపర్ణ కాఫీ తీసుకొని నేలకేసి కొడుతుంది. నువ్వు చేసిన మోసం చాలు ఇక నటించింది చాలు నీ చెల్లె ని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపో అని అపర్ణ అంటుంది. రేపు ఇంటిపెద్దల నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం అని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే వున్న సుభాష్ వంక కావ్య చూడగానే.. ఇప్పుడు నా వైపు చూసినా నేను ఎం చెయ్యలేని పరిస్థితి, నువ్వు ఇలా నిజం దాచడం తప్పు అని సుభాష్ అంటాడు. మరొక వైపు కావ్య సీతారామయ్య దగ్గరకి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. అబద్దం చెప్పలేదు నిజం మాత్రమే దాచాను. నేను జరిగింది చెప్పాను.. ఇక నిర్ణయం మీరు ఎం తీసుకున్న దానికి కట్టుబడి వుంటాను అని కావ్య చెప్తుంది. సీతరామయ్య మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు.
మరొకవైపు స్వప్న చేసిన మోసానికి రాహుల్ కోపంగా స్వప్న దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. తప్పు చేసావని రాహుల్ అనగానే.. రాహుల్ తప్పుల చిట్టాని స్వప్న బయటపెట్టి రాహుల్ మరొక మాట మాట్లాడకుండా చేస్తుంది. రాహుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తుంది స్వప్న. అనవసరంగా దీనితో పెట్టుకున్నానని రాహుల్ అనుకుంటాడు. మరొక వైపు కావ్య కృష్ణుడితో తన బాధని చెప్పుకుంటుంది.
కావ్య, స్వప్నల విషయంలో అపర్ణని ఇందిరాదేవి కూల్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది. అయినా అత్త మాట కూడా వినే స్థితిలో లో అపర్ణ ఉండదు. మరొకవైపు రాజ్ కావ్యల పెళ్లి ఫోటోని రాజ్ కాల్చి వేస్తుంటాడు. అది చూసిన కావ్య చాలా దూరం వెళ్తున్నారని రాజ్ తో అనగానే.. రేపు తాతయ్య నిర్ణయంతో ఈ దూరం శాశ్వతం అవుతుంది. ఆ తర్వాత మన బంధానికి తెర పడాలని కోరుకుంటున్నానని రాజ్ అనగానే.. కావ్య మనసు ముక్కలు అవుతుంది. దుగ్గిరాల ఇంటి పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు? కావ్య గమ్యం ఎటు వైపు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |